లిక్కర్ కు డబ్బులు ఇవ్వలేదని తండ్రి హత్య

  • జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలో ఘటన

శాంతినగర్, వెలుగు: లిక్కర్  కోసం డబ్బులు ఇవ్వలేదని ఉప్పరి చిన్న కృష్ణయ్య(52)ను కొడుకు యుగంధర్  హత్య చేశాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జక్కరెడ్డిపల్లెకు చెందిన తండ్రి వడ్డే చిన్న కృష్ణయ్య, కొడుకు యుగంధర్  తాగి గొడవ పడుతుండేవారు. 

ఆదివారం తండ్రిని లిక్కర్  కోసం డబ్బులు అడిగాడు. లేవని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తండ్రిని ఇంటిలోకి తీసుకెళ్లి ఇంట్లో డెక్(టేప్  రికార్డర్) ఆన్  చేసి కత్తిపీటతో నెత్తిపై కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఎస్ఐ సంతోష్  ఘటనా స్థలాన్ని పరిశీలించి ఎంక్వైరీ చేస్తున్నారు.