కుషాయిగూడలో పట్టపగలే.. నడిరోడ్డుపై కన్నతండ్రిని కత్తితో పొడిచి చంపిన కొడుకు

కుషాయిగూడలో పట్టపగలే.. నడిరోడ్డుపై కన్నతండ్రిని కత్తితో పొడిచి చంపిన కొడుకు

 హైదరాబాద్ నగరంలో ఈ మధ్య దారుణాలు పెరిగి పోతున్నాయి.  పట్టపగలే హత్యలు జరుగుతున్నాయి. అందరు చూస్తుండగానే నేరాలు చేస్తున్నారు.  లేటెస్ట్ గా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో  పట్టపగలే ఓ కుమారుడు తన తండ్రిని నరికి చంపాడు. ఈ ఘటన స్థానికంగ కలకలం రేపుతోంది. 

ఫిబ్రవరి 21న సాయంత్రం 4 గంటల 48 నిమిషాలకు  కుషాయిగూడ పోలీస్ స్టేషన్ కూత వేటు దూరంలో ఈ ఘటన జరిగింది.  నడిరోడ్డు మీద లాలాపేట్ లో నివాసం ఉండే ఆరెల్లి సాయి కుమార్ అనే కుమారుడు తన  తండ్రి మొగిలిని వెంటాడి వేటాడి దారుణంగా కత్తితో పొడిచాడు. అతడికి తీవ్రంగా గాయాలయ్యాయి.  ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.   

ఈ ఘటన జరుగుతుండగా రోడ్డుపై అందరు చూస్తుండిపోయారు. అయినా ఏ ఒక్కరు కూడా అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు.   ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయాలైన తండ్రిని  దగ్గర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.   చికిత్స పొందుతున్న తండ్రి  ఫిబ్రవరి 22న మృతి చెందాడు.

తండ్రి మొగిలి రోజు మధ్యం తాగొచ్చి గొడవ చేస్తున్నాడని.. ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్న కోపంతో నే ఈ హత్య చేసినట్లు నిందితుడు సాయికుమార్ ఒప్పుకున్నాడు.  కడుపులో 10 నుంచి 15 కత్తి పోట్లు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.