తల్లిపై కిరోసిన్ పోసి నిప్పటించిన కొడుకు

తల్లిపై కిరోసిన్ పోసి నిప్పటించిన కొడుకు

నల్గొండ జిల్లా నర్సింగ్‌బట్లలో దారుణం జరిగింది. తొమ్మిది నెలలు మోసి, కని, పెంచిన కన్నతల్లిపై ఓ కొడుకు కిరోసిన్ పోసి నిప్పటించాడు. తల్లి పట్ల కన్నకొడుకే యముడయ్యాడు. నర్సింగ్‌బట్లకు చెందిన శాంతమ్మ కొడుకు లింగస్వామి హైదరాబాద్‌లో పనులు చేసుకుంటూ జీవించేవాడు. అయితే లాక్డౌన్ వల్ల హైదరాబాద్‌లో పనులేవీ లేకుండా పోయాయి. దాంతో లింగస్వామి 10 రోజుల క్రితం సొంతూరికి చేరాడు. అప్పటినుంచి అక్కడే ఉంటున్న లింగస్వామికి.. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దాంతో తల్లిని పోషించలేక.. ఆమె నిద్రిస్తున్న సమయంలో కిరోసిన్ పోసి నిప్పటించాడు. దాంతో ఆమె ఇంట్లోనే మరణించింది.

For More News..

నచ్చిన కోర్సులో సీటు రాక.. ఇష్టంలేని కోర్సు చదవలేక..

భూములు పాయే..  ప్రాజెక్టు పాయే.. కొలువులు రాకపాయే..

రూ. 170 కోసం దోస్తుల గొడవ.. ఒకరి మృతి