తాగుడుకు బానిసై.. తల్లినే చంపిన కొడుకు
వరంగల్ అర్బన్ : హన్మకొండలో దారుణం జరిగింది. తాగుడుకు బానిసై తల్లిని చంపాడు కిరాతక కొడుకు. హన్మకొండ నక్కలగుట్టలో ఉంటున్న బాషబోయిన బాలమణిని ఆమె కొడుకు.. రేవంత్ అలియాస్ రాజు చంపేశాడు.
బాలామణి రైల్వేలో ఉద్యోగం చేస్తోంది. తాగుడుకు బానిసైన కొడుకు రాజు… రోజూ డబ్బుల కోసం తల్లిని వేధించేవాడు. ఇవాళ ఉదయం కూడా డబ్బు కావాలంటూ గొడవపడ్డాడు. తల్లితో ఘర్షణలో ఆమెపై దాడిచేశాడు. గొంతు నులమడంతో ఆమె ప్రాణం కోల్పోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత… నిందితుడు రాజు పారిపోయాడు.