Dahaad Series Review: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ "దహాద్".ట్రైలర్ తోనే మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సిరీస్ మొదటి సీజన్ మే 12న అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సిరీస్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. మరి ఈ సిరీస్ కథ ఏంటి? ఎలా ఉంది? అనేది ఇప్పుడు తెల్సుకుందాం.
కథ: రాజస్థాన్ లోని మండువలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. అది కూడా పబ్లిక్ టాయిలెట్స్ లో. ఈ కేసు పోలీసులకి తలనొప్పిగా మారుతుంది. ముందుగా ఈ మరణాలను ఆత్మహత్యలుగా భావిస్తారు కానీ.. తరువాత దీని వెనుక ఒక సీరియల్ కిల్లర్ ఉన్నాడని తెలుస్తుంది. ఈ కేసును ఛేదించడానికి సబ్ ఇన్స్పెక్టర్ అంజలి భాటి(సోనాక్షి సిన్హా) రంగంలోకి దిగుతుంది. మరి ఆ మరణాలు నిజంగా ఆత్మహత్యలేనా? కాకపోతే వారిని ఎవరు ఎందుకు చంపుతున్నారు అనేది మిగిలిన కథ.
నటీనటులు: నటీనటుల విషయానికి వస్తే సబ్ ఇన్స్పెక్టర్ అంజలి భాటిగా సోనాక్షి సిన్హా అద్భుతమైన నటనని కనబరిచింది. అంత దారుణమైన హత్య కేసుని ఛేదించే పోలీస్ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఇక మరో ముఖ్య పాత్రలో విజయ్ వర్మ నటించాడు. ఆయన పాత్ర కూడా ఈ సిరీస్ లో చాలా కీలకం. అమాయకుడైన ఉపాధ్యాయుడి పాత్రలో నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు విజయ్ వర్మ.ఇక మిగతా వారు తమ పాత్రకి న్యాయం చేశారు.
రివ్యూ: దర్శకులు రీమా కగ్తీ మరియు జోయా అక్తర్ కథని నడిపిన తీరు అద్భుతం అని చెప్పాలి. నిజానికి ఇది ఒక సీరియల్ కిల్లర్ కథ. కానీ ఆ కథని నడిపించిన తీరు, అందులో వచ్చే ట్విస్ట్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తాయి. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్.. ఆధ్యాంతం అలరిస్తుంది. కథనం అంత గ్రిప్పింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఎం జరుగుతుంది అనే ఉత్కంఠని రేకెత్తించడంలో దర్శకులు సూపర్ సక్సెస్ అయ్యారు. రివ్యూ రేటింగ్ లో 4 పాయింట్స్ సాధించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో హిందీలో ఉంది వీలుంటే మీరు ఒక లుక్కేయండి ఖచ్చితంగా నచ్చుతుంది.