టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని..వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్, రెడ్ చిత్రాలతో విజయాలు సాధించిన రామ్..హ్యాట్రిక్ హిట్పై కన్నేశాడు. ఈ నేపథ్యంలో ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ పాత్రలో అభిమానులను అలరించేందుకు ది వారియర్గా వస్తున్నాడు. రీసెంట్గా రిలీజైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రాగా..బుల్లెట్ సాంగ్ను ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి దడ దడ సాంగ్ను ప్రముఖ దర్శకులు గౌతమ్ మీనన్ విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ పాట విడుదలైంది.
దడ దడమని హృదయం శబ్దం..నువు ఇటుగా వస్తావని అర్థం అంటూ సాగే సాంగ్..మనసును హత్తుకుంటోంది. మహాలక్ష్మి విజిల్ వేసి పోలిస్తే... 'చెవినది పడి కవినయ్యానే అంటూ రామ్ రోమాంటిక్ పాట అందుకున్నారు. శ్రీమణి సాహిత్యం అందించగా... హరిచరణ్ పాటను ఆలపించారు. ఇక ది వారియర్ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు.
ది వారియర్ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరీ నిర్మిస్తున్నారు. మూవీని తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న విడుదల చేస్తున్నారు. వారియర్లో విలన్గా ఆది పినిశెట్టి కనిపించనున్నారు. అటు ది వారియర్ మూవీ సెట్స్పై ఉండగానే.. రామ్ మరో సినిమాను మొదలు పెట్టారు. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నారు.