14 కోట్ల మంది పొట్ట కొడుతున్నారు.. వెంటనే జనగణన చేపట్టండి: సోనియా గాంధీ

14 కోట్ల మంది పొట్ట కొడుతున్నారు.. వెంటనే జనగణన చేపట్టండి: సోనియా గాంధీ

కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు చేపట్టకుండా 14 కోట్ల మంది పేదల పొట్ట కొడుతోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా మండిపడ్డారు.  పార్లమెంటు జీరో అవర్ లో వీలైనంత తొందరగా దేశ వ్యాప్తంగా జనాభా లెక్కలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రం జనాభా లెక్కలు వాయిదా వేయడం వలన దాదాపు 14 కోట్ల మంది పేదలను మోసం చేస్తోందని మండిపడ్డారు. 

 జాతీయ ఆహార భద్రత చట్టం  (National Food Security Act (NFSA)) కింద ఇప్పటికీ 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం దారుణమని అన్నారు. పెరిగిన జనాభా ఆధారంగా 2025లో కొత్త జనాభా లెక్కలు జరిపి కొత్త డేటా ఆధారంగా స్కీమ్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

ALSO READ | మృగాల దాడుల్లో జనం బలవుతున్నా పట్టదా?

యూపీఏ ప్రభుత్వం 2013లో  జాతీయ ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చి 140 కోట్ల పేదలందరికీ ఆహార భద్రత అందించి చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు. కరువు సమయాలలో అదే విధంగా కోవిడ్-19 వంటి విపత్కర పరిస్థితుల్లో పేదలకు అండగా నిలిచిందని తెలిపారు. జాతీయ ఆహారభద్రత చట్టం2013 గ్రామీణ ప్రాంతాల్లో 70 శాతం మందికి, పట్టణ ప్రాంతాల్లో 50 శాతం మందికి సబ్సిడీ కింద ఆహార సరుకులు ఇచ్చి అండగా నిలిచిందని అన్నారు. 2011 లెక్కల ప్రకారం 81 కోట్ల 35 లక్షల మందికి ఈ పథకం అందిందని గుర్తు చేశారు. 

ప్రస్తుత బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం పేదల ఆకలి తీర్చే ఆలోచనలో లేదని విమర్శించారు. చరిత్రలో మొట్ట మొదటి సారి 2011 తర్వాత జనాభా లెక్కలు 4 ఏండ్లు జరపకుండా ఉందంటే అది కేవలం బీజేపీ ఏలుబడిలోనేనని ఘాటు విమర్శలు చేశారు.