ఉపాధి కూలీల రోజువారీ వేతనం 400కు పెంచాలి : సోనియా గాంధీ

ఉపాధి కూలీల రోజువారీ వేతనం 400కు పెంచాలి : సోనియా గాంధీ
  • ఏడాదికి150 రోజులపాటు పని కల్పించాలి: సోనియా గాంధీ

న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ ప‌‌‌‌థ‌‌‌‌కంలో పనిచేసే కూలీల రోజువారీ వేతనం రూ.400కు పెంచాల‌‌‌‌ని కేంద్రాన్ని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్‌‌‌‌ పర్సన్, రాజ్యసభ మెంబర్​ సోనియా గాంధీ డిమాండ్ చేశారు. వారికి ఏడాదికి 150 రోజులపాటు పని కల్పించాలని సూచించారు. మంగళవారం రాజ్యసభలో జీరో అవర్ సందర్భంగా సోనియా మాట్లాడారు. "ఉపాధి హామీ పథకాన్ని 2005లో అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ప్రభుత్వం అమలు చేసింది. లక్షలాది మంది గ్రామీణ పేదలకు రక్షణ కవచంగా పనిచేసింది. 

కానీ, ప్రస్తుత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని క్రమపద్ధతిలో అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నది. ఇది చాలా ఆందోళనకరం. చాలా కాలంగా ఉపాధి హామీ పథకానికి కేవలం రూ.86 వేల కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారు. ఇది జీడీపీలో 10 ఏండ్ల కనిష్ట స్థాయి. వాస్తవానికి, కేటాయించిన బడ్జెట్ రూ.4 వేల కోట్లు తగ్గింది. 

అంతేకాకుండా కేటాయించిన మొత్తంలో దాదాపు 20 శాతం గతేడాది పెండింగ్ బకాయిల చెల్లింపులకు ఖర్చుచేశారు. అదీకాక.. ఈ స్కీమ్ ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ, నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ నుంచి మినహాయించడం వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. దీనివల్ల కూలీలకు వేతనాల చెల్లింపులో జాప్యం జరుగుతున్నది. అందువల్ల కూలీల కనీస వేతనాన్ని పెంచాలి" అని కేంద్రాన్ని సోనియా డిమాండ్ చేశారు.