
ఢిల్లీ: కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్, రాజ్యసభ సభ్యురాలు సోనియాగాంధీ ఆరోపించారు. బడ్జెట్ లో ఈ పథకానికి నిధుల కేటాయింపు చాలా కాలంగా 86వేల కోట్లు దాటడం లేదని విమర్శించారు.
రాజ్యసభలో జీరో అవర్ లో మాట్లాడిన ఆమె... నిధులు పెంచకపోగా, మరో 4వేల కోట్లు తగ్గించారన్నారు. గ్రామాల్లోని కోట్లాది పేద ప్రజల ఉపాధి కోసం యూపీఏ ప్రభు త్వం తీసుకొచ్చిన చారిత్రాత్మక చట్టంగా పేర్కొన్న సోనియా... పెండింగ్ బకాయిలను కూడా చెల్లించేందుకు సుమారు 20శాతం నిధులు ప్రస్తుత కేటాయింపుల్లో కలుపాలని డిమాండ్ చేశారు.
గ్రామీణ ఉద్యోగ హామీ పథకం కింద కనీస వేతనాన్ని రోజుకు రూ.400 కు పెంచాలన్నారు. అలాగే సంవత్సరానికి ఉపాధి హామీ పనిదినాల సంఖ్యను 100 నుంచి 150 కి పెంచాలని డిమాండ్ చేశారు సోనియా.