ఐదు రాష్ట్రాల్లో ఓటమికి సోనియా గాంధీ ఒక్కరినే బాధ్యులు చేయడం కరెక్ట్ కాదని, కాంగ్రెస్ ఓటమికి పార్టీలోని ప్రతి ఒక్కరూ కారణమేనని కాంగ్రెస్ సీనియర్ లీడర్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇటీవల జరిగిన ఉత్తర ప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సోనియా, రాహుల్, ప్రియాంక వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ లోని వ్యతిరేక వర్గం డిమాండ్ చేస్తోంది. ఇప్పడు తన వ్యాఖ్యలతో వ్యతిరేక వర్గానికి కౌంటర్ ఇచ్చారు ఖర్గే. కాంగ్రెస్ ఓటమికి రాష్ట్ర పార్టీ నాయకుల నుంచి ఎంపీల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, సోనియా, రాహుల్, ప్రియాంక తమ పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు కూడా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబ నాయకత్వంలోనే వెళ్లనుందని గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉండే కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
We all told Sonia Gandhi that she alone is not responsible for the defeat in 5 states, every state leader & MP is responsible, not Gandhi family. We reimposed our faith in her, there's no question of offering resignation: Congress leader Mallikarjun Kharge pic.twitter.com/4fcGWyKm46
— ANI (@ANI) March 14, 2022