మంత్రి కొండా సురేఖకు సోనియా గాంధీ లేఖ

మంత్రి కొండా సురేఖకు సోనియా గాంధీ లేఖ
  • కాళేశ్వర ముక్తీశ్వర స్వామి 
  • మహా కుంభాభిషేకం నిర్వహించడంపై ప్రశంస

హైదరాబాద్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహిం చడంపై మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ మాజీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోనియా గాంధీ అభినందించారు. ఈ మేరకు ఆమెను ప్రశంసిస్తూ లేఖ రాశారు. 42 ఏండ్ల తర్వాత ప్రత్యేక చొరవ తీసుకొని మహా కుంబాభిషేకం నిర్వహించడం హర్షణీయమని లేఖలో పేర్కొన్నా రు. 

త్రివేణి సంగమం జలాలకు ఎంతో ప్రత్యేకత ఉందని ప్రస్తావించారు. తనకు ప్రసాదాన్ని, త్రివేణి సంగమం పవిత్ర జలాలను పంపించినందుకు కొండా సురేఖకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఫిబ్రవరి 9, 10 తేదీల్లో మంత్రి కొండా సురేఖ కాళేశ్వరంలో ప్రత్యేక పూజలు చేయించి, ప్రసాదాన్ని సోనియా గాంధీకి పంపారు.