సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలి.. బీజేపీ నేతల డిమాండ్

సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలి.. బీజేపీ నేతల డిమాండ్

న్యూఢిల్లీ: వక్ఫ్ బిల్లుపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా మాట్లాడుతూ.. వక్ఫ్ బిల్లును రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు. అలాగే, ఈ బిల్లుతో సమాజంలో శాశ్వత విభజన తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. 

"విద్య, పౌర హక్కులు, స్వేచ్ఛ, సమాఖ్య నిర్మాణం, ఎన్నికల నిర్వహణ ఇలా ప్రతీ అంశంలోనూ మోదీ ప్రభుత్వం దేశాన్ని అగాధంలోకి లాగుతోంది. ఇక్కడ మన రాజ్యాంగం కేవలం కాగితాలకే పరిమితమవుతోంది" అని సోనియా అన్నారు. ఈ నేపథ్యంలో నిషికాంత్ దూబే నేతృత్వంలోని బీజేపీ ఎంపీలు సోనియా గాంధీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.