
వక్ఫ్ సవరణ బిల్లును రాజ్యాంగంపై దాడియే అన్నారు సోనియాగాంధీ..బీజేపీ వ్యూహంలో భాగంగానే వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చారన్నారు. వక్ఫ్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరి స్పష్టంగా తెలియజేశాం. వక్ఫ్ బిల్లును బుల్డోజర్లతో తోసేశారని సోనియాగాంధీ విమర్శించారు. బుధవారం లోక్ సభలో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు గురువారం (ఏప్రిల్3న) రాజ్యసభలో ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం ఈ బిల్లుఆమోదంపై ఓటింగ్ ఉంటుంది.
రాజ్యసభలో ఈ బిల్లు ఇప్పుడు కీలకమైన పరీక్షను ఎదుర్కొంటోంది.ఇక్కడ ప్రస్తుత సభ్యుల మొత్తం బలం 236. బిల్లును ఆమోదించడానికి అధికార NDAకి 119 ఓట్లు అవసరం. స్వతంత్ర ,నామినేటెడ్ సభ్యుల మద్దతుతో, దాని సంఖ్య 125కి చేరుకుంటుంది. ప్రతిపక్షం వద్ద 95 ఓట్లు ఉండగా16 మంది సభ్యులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.