తెలంగాణ ఇచ్చిన తాము..రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరిలో పాల్గొన్న ఆమె..ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణకు ఎంతో శుభదినమని..నిజాం పాలన నుంచి విముక్తి పొందిన రోజని చెప్పారు. ఇంతటి గొప్ప రోజున ఆరు గ్యారెంటీలను ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు సోనియా గాంధీ. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తన కల అని చెప్పారు. ఆ కలను నేరవేర్చాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా బోయిన్ పల్లిలో రాజీవ్ గాంధీ నాలెడ్జ్, ట్రైనింగ్ సెంటర్ కు సోనియా గాంధీ శంకుస్థాపన చేశారు.
సోనియా గాంధీ ప్రకటించిన గ్యారెంటీలు
- మహాలక్ష్మి పథకం .. మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 సాయం.
- ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం.
- రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్.
- ఇందిరమ్మ ఇండ్లు .. ఇల్లు లేనివారికి ఇంటి స్థలంలో నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం
- ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల స్థలం కేటాయింపు
- రైతుభరోసా రైతులు, కౌలురైతులకు ఏటా రూ. 15,000 పంట పెట్టుబడి సాయం.
- వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ. 12,000 సాయం. వరి పంటకు ప్రతి క్వింటాల్‌కు రూ. 500 బోనస్.
- గృహజ్యోతి... ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు.
- యువ వికాసం.. విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు. ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ పాఠశాల ఏర్పాటు.
- చేయూత .. నెలకు రూ. 4,000 చొప్పున పింఛను.
- రూ. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా