ఢిల్లీని ఆనుకుని ఉండే హర్యానాలో ఒకప్పుడు కాంగ్రెస్‌ది తిరుగులేని పెత్తనం. భూపిందర్ హుడా రెండుసార్లు సీఎంగా పనిచేసినా, 2014లో మోడీ హవాలో కొట్టుకుపోయారు. కేవలం 15 సీట్లతో అపోజిషన్ హోదానైనా దక్కించుకోలేకపోయారు. రాహుల్ హయాంలో హుడాని దాదాపు తెరవెనక్కి నెట్టేశారు. ఇప్పుడు మళ్లీ సోనియా పార్టీ పగ్గాలు అందుకోవడంతో.. హుడాకి దశ తిరిగింది. పీసీసీ చీఫ్‌గా కుమారి షెల్జా ఉన్నా.. ఆమెకు లోకల్ పాలిటిక్స్‌పై పట్టు లేదు. షెల్జా దళిత ఓట్లను, హుడా జాట్ ఓట్లను రాబడతారని ఏఐసీసీ అంచనా వేస్తోంది.
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. ఈలోగా స్టేట్ కాంగ్రెస్‌లో చెప్పుకోదగ్గ మార్పులు జరిగాయి. పార్టీ చీఫ్ సోనియా గాంధీ మార్క్ మళ్లీ స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్‌లోని గొడవలను తీర్చటానికి ఆమె తన స్టయిల్లో ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. నేతలంతా ఒక్క మాట మీద నిలబడేలా చేయటం, లాయల్‌గా ఉండేవాళ్లకి పదవులు కట్టబెట్టడం, అందరికీ సమానంగా అధికారాలు ఇవ్వటం, నచ్చని విషయాలను పద్ధతి ప్రకారం చెప్పే నాయకులకు ఛాన్స్ కల్పించటం.. సోనియాగాంధీ మేనేజ్మెంట్లోని కొన్ని అంశాలు.
పార్టీ చీఫ్‌గా ఉన్నప్పుడు రాహుల్‌గాంధీ హర్యానాలో కొందరికి ప్రాధాన్యం ఇచ్చారు. వాళ్లందరినీ ఆమె పక్కన పెట్టారు. నెహ్రూ–గాంధీ ఫ్యామిలీకి నమ్మిన బంటు అయిన మాజీ సీఎం భూపిందర్ హుడాను రాహుల్ గాంధీ పెద్దగా పట్టించుకోలేదు. ఇది పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో నష్టం తెచ్చింది. దీంతో ఆయనను అసెంబ్లీ ఎలక్షన్ కమిటీ హెడ్‌గా సోనియా నియమించారు. ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తే మరోసారి ముఖ్యమంత్రిని చేస్తానని కూడా మాటిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
దళిత ఓట్ల కోసమే షెల్జా
హర్యానాలో పీసీసీ పగ్గాలను హైకమాండ్ దళిత నాయకురాలైన కుమారి షెల్జాకు అప్పగించింది. ఆమె లీడర్‌షిప్‌పై పీసీసీ వర్గాల్లో నమ్మకం లేదు. ఎందుకంటే.. షెల్జా ఎప్పుడూ హర్యానా రాష్ట్ర రాజకీయాల్లో లేరు. 1991లో మొదటిసారి సిర్నా (హర్యానా) నుంచి గెలిచి పీవీ నరసింహారావు కేబినెట్లో సహాయ మంత్రిగా పనిచేశారు. 1996లో సిర్సా; 2004, 2009 ఎన్నికల్లో అంబాలా నియోజకర్గాల నుంచి గెలిచారు. ప్రస్తుతం రాజ్యసభ మెంబర్‌గా ఉన్నారు. ఆమె ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీకి సన్నిహితురాలు కావడంతో హర్యానా బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. లోకల్ పాలిటిక్స్‌పై షెల్జా పట్టు సాధించేసరికి పుణ్యకాలం గడిచిపోతుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. షెల్జా దళితులను తిరిగి పార్టీలోకి తెస్తారన్న అంచనాతో ఉన్నారు.
మరిన్ని వెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి