వైఎస్సార్​ 75 వ జయంతి సందర్భంగా.... కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ మెసేజ్​....

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 75 వ జయంతి సందర్భంగా  కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ మెసేజ్​ పంపించారు.రాజశేఖరరెడ్డి గారి ఆశయాలను వైఎస్​ షర్మిల ముందుకు తీసుకెళ్తున్నారంటూ... వైఎస్సార్​వ్యక్తిగత  స్మృతులనుయ ఎంతో గౌరవిస్తున్నానని సోనియా తెలిపారు. వైఎస్​ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్​ పార్టీ బలపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు జాతికి, కాంగ్రెస్​ పార్టీకి, ఆంద్రప్రదేశ్ ప్రజలకు ఎంతో దోహదపడాల్సిన  మహానేత  లేకపోవడం పట్ల  ప్రతిరోజూ సంతాపం తెలుపుతున్నామంటూ...  ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్​ ను గౌరవిస్తుందని తెలిపారు.

 సోనియా అందించిన అద్భుతమైన సందేశాన్ని గుర్తించినందుకు  చాలా ఉప్పొంగిపోయానని షర్మిల తెలిపారు.   కాంగ్రెస్‌తో ఆయనకున్న అనుబంధాన్ని...  ..  పంచుకున్న బంధాన్ని, మరీ ముఖ్యంగా తన చివరి శ్వాస వరకు ఆయన అందించిన సేవలను కొనియాడారు. . ఈ సందర్భంగా తన  గురించి స్ఫూర్తిదాయకమైన మాటలకు ధన్యవాదాలు, మేడమ్, నిజమైన కాంగ్రెస్ యోధుడిగా పార్టీకి సేవ చేయడం మరియు ప్రజల కోసం పోరాడాలనే అత్యంత ప్రతిష్టాత్మక మిషన్‌ను నాకు గుర్తు చేసినందుకు... నేను నా తండ్రి ఆశయాలను  కొనసాగిస్తానంటూ... రాహుల్ జీ ఆకాంక్షలను సాధించడానికి కృషి చేస్తానని వైఎస్​ షర్మిల ట్వీట్​ చేశారు.

  వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా ఆయనతో సోనియాగాంధీకి ఉన్న  అనుబంధాన్ని, పార్టీకి ఆయన చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్న శ్రీమతి సోనియా గాంధీకి హృదయపూర్వక ధన్యవాదాలంటూ  షర్మిల ట్వీట్​ చేశారు.  నాపై మీకున్న నమ్మకం ఎప్పుడూ నా గొప్ప బాధ్యతను గుర్తు చేస్తూనే ఉంటుంది. రాజశేఖరరెడ్డిగారి స్ఫూర్తిని గుండెల్లో పెట్టుకుని ఆయన ప్రేమించిన, బతికించిన కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తగా ప్రజల పక్షాన నిలిచి రాహుల్ గాంధీ ఆశయ సాధన కోసం పోరాడతానన్నారు.