జ్యోతిర్మఠం  స్వామీజీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు : సోనియాగాంధీ

అవిముక్తేశ్వరానంద సరస్వతీ జీ మహారాజ్‌  పుట్టినరోజు వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి.  జ్యోతిర్మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతీ జీ మహారాజ్‌కు.. కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. స్వామి ఆశీస్సులు పొందానన్నారు.  ఇది తనకు ఎంతో గౌరవంగా ఉందన్న సోనియాగాంధీ.... కొన్ని అనివార్య కారణాల వల్ల తాను పుట్టిన రోజు వేడుకలకు హాలజరు కాలేకపోయానన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు శంకరాచార్య జీ .. దీర్ఘాయువుతో ( ఎల్లకాలం) ఆరోగ్యంగా ఉండాలని తాను ప్రార్థిస్తున్నానని సోనియాగాంధీ తెలిపారు.