
రాష్ట్రం అవతరణ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర కల నిజం చేసుకొని 10ఏళ్లు అవుతున్న క్రమంలో ఆమె అమరవీరుల త్యాగాన్ని స్మరించుకున్నారు. పరేడ్ గ్రౌండ్ వేడుకల్లో సోనియా గాంధీ పంపిన వీడియో క్లిప్ మెస్సేజ్ ను ప్లే చేశారు. తెలంగాణ అమర వీరులకు ఆమె శ్రద్ధాంజలి తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కలను నిజం చేశామని సోనియమ్మ అన్నారు. తెలంగాణ ప్రజలు పదేళ్లుగా తనను ఎంతో గౌరవించారని ఆమె గుర్తు చేసుకుంది.