అమానవీయం.. తల్లిని పట్టించుకోని కొడుకులు

అమానవీయం.. తల్లిని పట్టించుకోని కొడుకులు

    కలెక్టర్‌‌‌‌కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు
    జిల్లా హాస్పిటల్‌‌‌‌కు తరలించిన ఆఫీసర్లు

కరీంనగర్‌‌‌‌ రూరల్‌‌‌‌, వెలుగు : వృద్ధాప్యంలో ఉన్న తల్లిని నలుగురు కొడుకులు పట్టించుకోకపోవడంతో తిండి పెట్టే దిక్కు లేక ఒంటరిగా ఉంటోంది. దీంతో వృద్ధురాలిని కాపాడాలంటూ గ్రామస్తులు కలెక్టర్‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌‌‌‌ ఆదేశాలతో ఆఫీసర్లు వృద్ధురాలిని జిల్లా హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. కరీంనగర్‌‌‌‌ రూరల్‌‌‌‌ మండలం నగునూరుకు చెందిన కోట లచ్చమ్మ (80)కు నలుగురు కొడుకులు, ఒక కూతురు. ఒక కొడుకు గ్రామంలోనే ఉంటుండగా, మిగిలిన ముగ్గురు వేరే చోట ఉంటున్నారు. లచ్చమ్మ పేరున సుమారు ఐదు ఎకరాల భూమి ఉంది. 

ఈ భూమిని సాగు చేసుకుంటున్న కొడుకులు వృద్ధాప్యంలో ఉన్న తల్లిని మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో పాత ఇంట్లో ఒంటరిగా ఉంటూ మంచానికే పరిమితం అయింది. వృద్ధురాలి పరిస్థితిని గమనించిన గ్రామస్తులు కలెక్టర్‌‌‌‌కు సమాచారం ఇచ్చారు. స్పందించిన కలెక్టర్‌‌‌‌ చర్యలు చేపట్టాలని మండల ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో తహసీల్దార్‌‌‌‌, పోలీస్‌‌‌‌ ఆఫీసర్లు శనివారం గ్రామానికి వచ్చి వృద్ధురాలితో మాట్లాడారు. ఆమెను ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు.