నారాయణపేట జిల్లా: వందేండ్లు నిండిన తల్లికి అరటిపండ్లతో తులాభారం

నారాయణపేట జిల్లా: వందేండ్లు నిండిన తల్లికి అరటిపండ్లతో తులాభారం

మద్దూరు, వెలుగు: వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న తల్లికి ఆమె కొడుకులు అరటిపండ్లతో తులాభారం నిర్వహించి తమ ప్రేమ చాటుకున్నారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం గొర్లోనిబావి గ్రామానికి చెందిన జంబుల లచ్చమ్మకు ఐదుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. లచ్చమ్మకు సోమవారంతో వందేండ్లు నిండాయి.

దీంతో ఆమె కొడుకులు బాలకృష్ణయ్య, రాములు, వెంకటయ్య, భీమన్న, సహదేవులు కలిసి తమ తల్లికి అరటి పండ్లతో తులాభారం వేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా భార్య, కొడుకులు, కూతుళ్లతో పాటు తమ ముగ్గురు చెల్లెళ్లు మొత్తం 60 మంది కుటుంబసభ్యుల నడుమ పుట్టిన రోజు వేడుకలు జరిపారు. అనంతరం అరటిపండ్లతో తులాభారం నిర్వహించారు. తర్వాత ఆ పండ్లను గ్రామంలో పంచిపెట్టారు.