Sonu Model Video Song: విశ్వక్ సేన్ లైలా నుంచి మోడెల్ సాంగ్ రిలీజ్..

Sonu Model Video Song: విశ్వక్ సేన్ లైలా నుంచి మోడెల్ సాంగ్ రిలీజ్..

తెలుగు ప్రముఖ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం "లైలా" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ కి జంటగా హిందీ బ్యూటీ ఆకాంక్ష శర్మ నటిస్తుండగా ప్రముఖ దర్శకుడు రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రేమికుల రోజు దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రొమాంటిక్ లవ్ జోనర్ లో రామ్ నారాయణ్ ఈ సినిమా తెరకెక్కిస్తుండగా పలు తెలుగు సినిమాలని నిర్మించిన యంగ్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి నిర్మిస్తున్నాడు.

ఆదివారం ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ సోనూ మోడల్ అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటని ప్రముఖ సింగర్స్ నారాయణన్ రవిశంకర్, రేష్మా శ్యామ్ పాడగా హీరో విశ్వక్ సేన్ లిరిక్స్ అందించాడు. మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ కంపోజ్ చేయగా భాను కొరియోగ్రాఫ్ చేశాడు. విజిల్ విజిల్ నువ్వు కొడతావ్ విజిల్ అంటూ మొదలయ్యే లిరిక్స్ ఆడియన్స్ ని బాగానే అలరిస్తున్నాయి.

అయితే ఇటీవలే విశ్వక్ సేన్ హీరోగా నటించిన మేఖనిక్ రాఖీ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఆడియన్స్ ని అలరించినప్పటికీ కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. దీంతో లైలా సినిమాతో హిట్ కొట్టాలని విశ్వక్ సేన్ బాగానే శ్రమిస్తున్నాడు.