ఇవాళ నా భార్య బతికిందంటే అదొక్కటే కారణం.. సతీమణి యాక్సిడెంట్‎పై ఫస్ట్ టైమ్ స్పందించిన సోనూ సూద్

ఇవాళ నా భార్య బతికిందంటే అదొక్కటే కారణం.. సతీమణి యాక్సిడెంట్‎పై ఫస్ట్ టైమ్ స్పందించిన సోనూ సూద్

ముంబై: ప్రముఖ నటుడు సోనూ సూద్ భార్య సోనాలి సూద్‎కు ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆమె ప్రయాణిస్తోన్న కారు నాగ్‌పూర్ హైవేపై ప్రమాదానికి గురి కావడంతో సోనాలి గాయపడ్డారు. ఈ క్రమంలో తన భార్యకు రోడ్డు ప్రమాదం జరగడంపై సోనూ సూద్ తొలిసారి స్పందించారు. ఈ మేరకు మంగళవారం (ఏప్రిల్ 8) సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసిన సోనూ.. ప్రజలకు ఒక కీలక సందేశమిచ్చారు. 

రోడ్లపై ప్రయాణించేటప్పుడు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతి ఒక్కరినీ కోరారు. కారులో ప్రయాణిస్తోన్నప్పుడు ఏ సీట్లో కూర్చొన్న సీట్ బెల్ట్ కచ్చితంగా పెట్టుకోవాలని.. ఇవాళ నా భార్య ప్రాణాలతో ఉందంటే కారణం సీట్ బెల్టేనని పేర్కొన్నారు. వాహనంలో ఎక్కడ కూర్చొన్న సీట్ బెల్ట్ మాత్రం మస్ట్ అని.. మీరు వెనుక సీట్లో కూర్చున్నప్పటికీ సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.  

►ALSO READ | Allu Arjun Turns 43: ఇంట్లోనే కేక్ కట్ చేసిన అల్లు అర్జున్.. ఫొటో షేర్‌ చేసిన స్నేహారెడ్డి

సోనూసూద్ వీడియోలో చెప్పిన దాని ప్రకారం.. ‘‘ఇది చాలా ముఖ్యమైన సందేశం. గత వారం నాగ్‌పూర్‌లో ఒక పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అప్పుడు నా భార్య, ఆమె సోదరి కారు లోపల ఉన్నారు. ప్రమాద తీవ్రతకు కారు ఏ విధంగా ధ్వంసమైందో అందరూ చూశారు. ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. ఈ ప్రమాదం నుంచి వారిని కాపాడింది ఓన్లీ సీట్ బెల్టే. నా భార్య సోనాలి ఆమె సోదరిని సీట్ బెల్ట్ ధరించమని చెప్పింది. ఆమె సీట్ బెల్ట్ పెట్టుకున్న నిమిషానికే ప్రమాదం జరిగింది.

సీట్ బెల్ట్ ధరించడం వల్లే వారు ప్రాణాలతో బయటపడ్డారు. 100 మందిలో కారు వెనుక సీట్లో కూర్చున్న వారిలో 99 శాతం మంది ఎప్పుడూ సీట్ బెల్ట్ ధరించరు. సీట్ బెల్ట్ అంటే అదేదో ముందు ఉన్నవారే పెట్టుకోవాలన్నట్లు భావిస్తారు. కానీ నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను-. సీట్ బెల్ట్ లేకుండా కారులో ఎప్పుడూ కూర్చోవద్దు. కారులో ముందు, వెనక ఎక్కడ కూర్చున్న సీట్ బెల్ట్ ధరించండి. చాలా మంది డ్రైవర్లు పోలీసుల కోసమే సీట్ బెల్ట్ పెట్టుకుంటారు. కానీ నన్ను నమ్మండి సీట్ బెల్ట్ మీకు, మీ కుటుంబానికి భద్రతను ఇస్తుంది’’ అని పేర్కొన్నాడు సోనూ సూద్.