Fateh Box Office: గేమ్ ఛేంజర్కు పోటీగా సోనూ సూద్ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

రియల్ హీరో సోనూ సూద్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఫతే’(Fateh). ఈ మూవీకి హీరోగా, దర్శకుడిగా సోనూ సూద్ వ్యవహరించాడు. జీ స్టూడియోస్ నిర్మించింది. ఈ మూవీ శుక్రవారం జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. సైబర్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ సాధించింది. 

ట్రేడ్ వర్గాల అంచనాలకు మించి ఫతే మూవీ రూ.2.45 కోట్లు రాబట్టింది. ఈ సినిమాకు మొదటి రోజు వసూళ్లు రూ.70 లక్షల నుండి రూ.1 కోటి వరకు ఉండవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు. దీనితో రూ.2.45 కోట్లు ఓపెనింగ్స్‌ని రాబట్టి ఆశ్చర్యపరిచింది. గేమ్ ఛేంజర్ నుండి గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో ఈ మూవీ రానున్న రోజుల్లో ఊపందుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

జనవరి 10న మార్నింగ్ షోలలో 10.60 శాతం, మధ్యాహ్నం షోలలో 20.50 శాతం, ఈవినింగ్ షోలలో 28.53 శాతం మరియు నైట్ షోలలో 56.93 శాతం ఆక్యుపెన్సీతో కలిపి మొత్తంగా 29.14 శాతం ఆక్యుపెన్సీ థియేటర్లలో నమోదు చేసుకుంది.

ఫతే విడుదలకు ముందు, మేకర్స్ ఆడియన్స్ కోసం స్పెషల్ ఆఫర్‌నుతీసుకొచ్చారు. టిక్కెట్ ధరలను రూ. 99కి తగ్గించారు. ఇకపోతే, రు.15 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు అందుకోనుందో చూడాలి. గేమ్ ఛేంజర్ వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.186 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. హిందీ వెర్ష‌న్‌లో గేమ్ ఛేంజర్ రూ.7 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఈ మూవీ దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కింది. 

సైబర్ క్రైమ్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో వచ్చిన ఈ  సినిమా రియాల్టీకి దగ్గరగా ఉంది. లాక్‌‌డౌన్ టైమ్‌‌లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్‌‌ ఆధారంగా దీన్ని  రూపొందించారు. సోనూతో పాటు, ఫతేలో జాక్వెలీన్ ఫెర్నాండెజ్, విజయ్ రాజ్ మరియు నసీరుద్దీన్ షా కీలక పాత్రలు పోషించారు.