ఆస్థాన కవిగా సోనూసూద్..పోస్టర్కు సూపర్ రెస్పాన్స్

చారిత్రక చిత్రం సామ్రాట్ పృథ్వీరాజ్ అప్డేట్స్..మూవీపై రోజు రోజుకు అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ సినిమాలో పృథ్వీరాజ్ చౌహాన్ ఆస్థాన కవి చాంద్ బర్దాయి పాత్రలో సోనూసూద్ నటిస్తుండగా..ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పిక్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. చాంద్ బర్దాయి ఫస్ట్ లుక్పై  నెటిజన్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సోనూ కేరీర్లోనే ఈ సినిమా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ని అందిస్తుందని అనుకుంటున్నారు. ఇక సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాలో సోనూసూద్ పాజిటీవ్ రోల్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆచార్యలో సోనూసూద్ నెగెటివ్ రోల్లో యాక్ట్ చేశారు. ఆ సినిమా మెప్పించలేకపోయిన..సోనూ నటన ఆకట్టుకుంది. ప్రస్తుతం అతను హోమ్ ప్రొడక్షన్లో వస్తున్న ఫతే మూవీలో నటిస్తున్నాడు. 

ఢిల్లీని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రధాన పాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ అతనికి జోడిగా మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను చంద్రప్రకాష్ డైరెక్ట్ చేస్తున్నారు. శంకర్ - ఎహసాన్ - లాయ్ సంగీతం అందిస్తున్నారు.  ఢిల్లీ సామ్రాజ్యంపై అత్యంత క్రూరంగా దండయాత్ర చేసిన మహమ్మద్ ఘోరీ నుండి భారతదేశాన్ని రక్షించడానికి పృథ్వీరాజ్ చౌహాన్ చేసిన పోరాటాన్ని సినిమాలో చూపించనున్నారు. 

మరోవైపు ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, మ్యూజిక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.  ఇక చిత్రంలో సోనూసూద్తో పాటు.. సంజయ్ దత్, అశుతోష్ రానా, మానవ్ విజ్, సాక్షి తణ్వార్ లాంటి బాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రలు పోషించారు.  ఈ మూవీని జూన్ 3న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ చిత్రం విడుదల కానున్నట్లు తెలుస్తోంది.