ప్రత్యేకమైన బస్సుల ద్వారా వలస కూలీలని వారి స్వస్థాలలకు పంపిన నటుడు సోనూసూద్… లేటెస్ట్ గా ఫ్లైట్ ద్వారా 177 మంది అమ్మాయిలను వారి సొంత ఊర్లకి పంపారు. ఒడిశాలోని భువనేశ్వర్‌కి చెందిన అమ్మాయిలు తమ ఉద్యోగాలకి రాజీనామా చేసి ఇళ్ళకి వెళ్ళేందుకు రెడీ అయ్యారు. కొచ్చి నుండి భువనేశ్వర్ వెళ్లేందుకు రవాణా వ్యవస్థ సరిగా లేని పరిస్థితులలో భువనేశ్వర్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక ఫ్లైట్ ద్వారా వారందరిని స్వస్థలాలకి పంపారు సోనూసూద్.
కేఐటీఈఎక్స్ గార్మెంట్స్ లో పని చేసే 177 మందితో పాటు బవ వుడ్ ఇండస్ట్రీకి చెందిన 9 మందిని కూడా సేమ్ ఫ్లైట్‌లో పంపారు.