దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల్ని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నపటికి పెద్దగా ఫలితాలు ఉండటం లేదు. అయితే ఇటీవలే ముంబైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మరణించాడు. ఈ విషయంపై బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.
ALSO READ | పెళ్లి బరాత్ కారులో మంటలు.. వీడియో వైరల్
ఇందులోభాగంగా రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకుడి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియజేశాడు. అలాగే ముంబైలో రోడ్డు డివైడర్ ని కారు ఢీకొట్టిన ప్రమాదంలో మరణించిన యువకుడి గురించి తెలిసి చాల బాధేసిందని అన్నాడు. మన దేశంలో ప్రతిరోడ్డు డివైడర్ పైన వాటర్ ఫిల్డ్ రోడ్ క్రాష్ బారియర్స్ ఉంటే మనం లక్షలాది మంది ప్రాణాలను కాపాడగలమని నేను భావిస్తున్నానని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
అలాగే రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చే సమయంలో వాటర్ ఫీల్డ్ రాడ్ క్రాష్ బారియర్స్ తప్పనిసరిగా ఏర్పాటు చెయ్యాలని నిబంధన విధించాలని కోరాడు. జైహింద్ అంటూ వాటర్ ఫీల్డ్ రాడ్ క్రాష్ బారియర్స్ ఫోటోలను కూడా షేర్ చేశాడు. దీంతో కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఇది చాలా మంచి ఆలోచన అని, అధికారులు ఈ అంశంపై దృష్టి పెడితే మున్ముందు రోడ్డు ప్రమాదాల మరణాలు అరికట్టవచ్చని కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా నటుడు సోనూ సూద్ కరోనా ప్యాండమిక్ సమయంలో ఎంతోమంది నిరాశ్రయులకు సహాయం చేశాడు. అంతేగాకుండా గోవా, ముంబై నగరాల్లో ఉన్నటువంటి తన హోటల్స్ లో ఆశ్రయం ఏర్పాటు చేసి భోజనం కూడా అందించాడు. అలాగే ట్రాన్స్ పోర్ట్ సదుపాయం లేక ఇబ్బంది పడుతున్న ఎంతోమంది ప్రజలకి బస్సులు ఏర్పాటు చేసి తమ ఊళ్ళకి పంపించాడు. దీంతో సోనూ సూద్ ని ఎంతగానో అభినందించారు.
ప్రస్తుతం సోనూ సూద్ హిందీలో ఫతే అనే అనే సినిమాలో నటిస్తు దర్శకత్వం కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో హిందీ ప్రముఖ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ రాజ్, శివజ్యోతి రాజ్ పుత్, భట్టాచార్య తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో మరిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
I feel so sad to hear about a young boy who lost his life when his car crashed into a road divider in mumbai. I feel if our country has such kind of WATER FILLED ROAD CRASH BARRIERS on every road divider, we can save millions of lives. It should be made mandatory with every road… pic.twitter.com/6M4TYhUbcv
— sonu sood (@SonuSood) November 28, 2024