సోనూ సూద్.. పరిచయం అక్కరలేని పేరు. కరోనా సమయంలో స్వచ్ఛంద సేవ చేసి ప్రేక్షకుల నుంచి నిజమైన హీరో అనిపించుకున్న నటుడు సోనూ సూద్. వలస కార్మికులను వారి వారి ప్రాంతాలకు చేరవేయడంలో ఎంతో సహాయపడ్డారు. సొంత ఖర్చులతో ఎవరికి ఆపద వచ్చినా ఆదుకుంటూ ఎంతో మంది గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు.
అయితే ఇటీవల ఒక ఇంటర్వూలో సోనూ సూద్ చాలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తనకు సీఎం పదవి ఇస్తామని, తమ పార్టీలో చేరాలని ఆఫర్లు వచ్చాయని అన్నారు. తను తిరస్కరించడంతో కనీసం డిప్యూటీ సీఎం అయినా తీసుకొమ్మని, తమ పార్టీలో చేరమని చాలా పెద్ద పెద్ద వారు అడిగారని తెలిపారు. కానీ వాటిని తిరస్కరించినట్లు చెప్పారు. తన లక్ష్యం ప్రజలకు సేవ చేయడమేనని, అది రాజకీయాలలో లేకుండా కూడా చేయవచ్చునని అన్నారు.
ఒక ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి లేకుంటా కనీసం తమ పార్టీలో చేరాలని కొందరు కోరినట్లు తెలిపారు. రాజ్యసభకు పంపుతామని, తమ పార్టీలో చేరితే చాలని అడిగినట్లు తెలిపారు. కానీ తనకు ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదని చెప్పానని అన్నారు. భవిష్యత్తులో కూడా తన ఏ పార్టీలో చేరబోనని అన్నారు.
Also Read :- Samsung Galaxy Ring 2 న్యూ ఇయర్ లాంచింగ్
ఆఫర్లను స్వీకరించి ఉంటే పెద్ద బంగ్లా, ఎప్పుడూ సెక్యూరిటీ, చాలా ప్రయోజనాలు ఉండేవని.. కానీ తనకు అవి అవసరం లేవని తెలిపారు. ఒకవేళ పార్టీలో చేరితే చాలా ఎత్తుకు ఎదిగే వాడినని కానీ తను వద్దనుకున్నానని అన్నారు. ఎత్తుకు వెళ్లే కొలది గాలి తగ్గుతుందని, ఆక్సిజన్ తగ్గిపోతుందని, అంత ఎత్తులో ఉండే బతకడం ఎట్లా నవ్చించారు. తను ఉన్నచోటనే తనకు కంఫర్ట్ గా ఉందని అన్నారు.
సోనూ సూద్ నిర్ణయానికి చాలా మంది ఫిదా అయిపోతున్నారు. చాలా మంది ఏదో రంగంలో ఎదిగి చివరికి చేరుకునేది రాజకీయ రంగాన్నే. అలాంటిది సీఎం పోస్ట్ ఆఫర్ చేసినా వెళ్లకపోవడంపై కొందరు సరైన నిర్ణయమే అంటున్నారు. మరికొందరు చేరాల్సింది అని కామెంట్స్ చేస్తున్నారట. ఈ డిమాండ్ ఎప్పట్నుంచో ఉందనుకోండి. చేరుతారా లేదా అనేది కూడా ఆయన వ్యక్తిగత నిర్ణయం. కాకపోతే.. అంతగొప్ప ఆఫర్ వస్తే ఎవరు కాదంటారు. అది సోనూసూద్ అయితే తప్ప.