ప్రముఖ నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజకీయ ప్రవేశంపై గత రెండు నెలలుగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్వస్థలమైన మోగా నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నట్లు స్పష్టం చేశారు. సోమవారం సోనూ నివాసానికి వెళ్లిన పంజాబ్ సీఎం చరణ్జీత్ చన్నీ, కాంగ్రెస్ పార్టీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆయనతో పాటు మాళవికతో భేటీ అయ్యారు. అనంతరం వారిద్దరి సమక్షంలో మాళవిక కాంగ్రెస్లో చేరారు.
సోదరి మాళవిక రాజకీయ ప్రవేశంపై గతేడాది నవంబర్లోనే సోనూసూద్ ప్రకటన చేశారు. కానీ ఏ పార్టీలో చేరుతున్నారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. మాళవిక కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. కొన్నాళ్ల క్రితం పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ సోనూతో భేటీ కావడం ఈ వార్తలకు బలాన్నిచ్చింది. గతంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, శిరోమణి అకాళీదల్ అధినేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ సైతం మాళవికను కలిసినా చివరకు కాంగ్రెస్ వైపే మొగ్గుచూపారు.
Punjab: State Congress chief Navjot Singh Sidhu meets actor Sonu Sood and his sister at his residence in Moga pic.twitter.com/8FWyPd9AsM
— ANI (@ANI) January 10, 2022
For more news..