కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..

కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా  గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..

ఇటీవల జరిగిన రెండు ఐపీఎల్ మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్ టీమ్ ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లో గుజరాత్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో 6 రన్ల తేడాతో ఓడిపోగా, ఉప్పల్ లో హైదరాబాద్ తో జరిగిన రెండో మ్యాచ్ లో చివరి దాకా పోరాడి 34 రన్ల తేడాతో ఓడిపోయింది ముంబై. వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన ముంబైకి హార్దిక్ పాండ్య, రోహిత్ శర్మల వివాదం మరొక తలనొప్పిగా మారింది. హార్దిక్ పాండ్య రోహిత్ పట్ల వ్యవహరిస్తున్న తీరు బాగాలేదంటూ ఫ్యాన్స్ అటు స్టేడియంలోను, ఇటు సోషల్ మీడియాలోనూ తెగ ట్రోల్ చేసారు.

 

హార్దిక్ పాండ్య బౌండరీ లైన్ వద్ద ఉన్నప్పుడు, మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తున్న సమయంలో రోహిత్ శర్మ పేరును జపిస్తూ ఎద్దేవా చేశారు. ఈ ఇష్యూ మీద తాజాగా ప్రముఖ నటుడు సోనూ సూద్ స్పందించాడు. ప్లేయర్స్ కి తగిన గౌరవం ఇవ్వాలని ఎక్స్ ( ట్విట్టర్ )లో ట్వీట్ చేశాడు. గెలిచిన రోజు పొగిడి, ఓడినరోజు తిట్టడం సరికాదని. ఫెయిల్ అయ్యేది ప్లేయర్స్ కాదని, వాళ్ళను నిరుత్సాహపరిచేలా వ్యవహరించే మనమే అని ఫ్యాన్స్ కి హితబోధ చేశాడు. నా దేశం ఆడుతున్న ప్రతి ఒక్క ఆటగాడిని నేను ప్రేమిస్తానని, అది కెప్టెనైనా, ఎక్స్ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించటం నేర్చుకోవాలని ట్వీట్ చేసాడు సోనూ సూద్.