ఘోర రోడ్డు ప్రమాదం.. కారు నుజ్జునుజ్జు.. సోనూసూద్ భార్యకు గాయాలు

ఘోర రోడ్డు ప్రమాదం.. కారు నుజ్జునుజ్జు.. సోనూసూద్ భార్యకు గాయాలు

ముంబై: మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగ్పూర్లోని వార్ధా రోడ్లో ఫ్లై ఓవర్పై ట్రక్కును కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆ కారులో ఉన్న నటుడు సోనూసూద్ భార్య సోనాలీ సూద్ గాయపడింది. ఈ ఘటనలో సోనాలీ సూద్ అదృష్టవశాత్తూ బయటపడింది. సోమవారం రాత్రి 10.30 సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమెతో పాటు కారులో ఉన్న మరొకరు కూడా గాయపడ్డారు. సోనాలీ సూద్ తన సోదరి, మేనల్లుడితో కలిసి కారులో ప్రయాణిస్తున్నట్లు తెలిసింది.

సోనాలీ సూద్ మేనల్లుడే కారు నడిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. గాయపడిన ముగ్గురినీ నాగ్పూర్లోని మ్యాక్స్ హాస్పిటల్కు తరలించి వైద్యం అందించారు. కారు ప్రమాదంలో తన భార్య గాయపడిందనే విషయం తెలిసిన వెంటనే సోనూ సూద్ హుటాహుటిన హాస్పిటల్కు వెళ్లాడు. రాత్రంతా హాస్పిటల్లోనే తన భార్యకు తోడుగా ఉన్నారు. ఈ ప్రమాదంలో సోనాలీ సూద్, ఆమె మేనల్లుడికి గాయాలవగా, సోనాలీ సోదరి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడింది. ముంబై-నాగ్పూర్ హైవేపై ఈ ఘటన జరిగింది.

ALSO READ | భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారి.. అరాచకాలు భరించలేక భార్య, అత్త కొట్టి చంపేశారు