కన్నడ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 కంటెస్టెంట్ సోనూ శ్రీనివాస్ గౌడ(Sonu Srinivas Dowda)ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. బిడ్డను చట్టబద్దంగా కాకుండా అక్రమంగా దత్తత తీసుకున్న కారణంగా ఆమెను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. చట్ట ప్రాకారం పిల్లలను దత్తత తీసుకోవడంలో అనేక ప్రక్రియలు ఉన్నాయి. వాటిని సోనూ శ్రీనివాస్ పాటించలేదని ఆమె కేసు నమోదయింది. దీనిపై బైదరహళ్లి చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేప్పట్టి మరీ సోనూ శ్రీనివాస్ గౌడను అరెస్ట్ చేశారు పోలీసులు.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఇటీవల సోను శ్రీనివాస్ గౌడ్ తన సోషల్ మీడియాలో ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నట్లు పోస్ట్ పెట్టింది. అయితే ఈ దత్తత ప్రక్రియ చట్టవిరుద్దంగా జరిగిందని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారి గీత ఆమెపై బైదరహళ్లి పోలీస్ స్టేషన్ లో జేజే చట్టం కింద ఫిర్యాదు చేశారు. సాధారణంగా ఎవరినైనా దత్తత తీసుకోవాలంటే.. అక్కడి చైల్డ్ వెల్ఫేర్, ఆ జిల్లా కలెక్టర్ సమక్షంలో దత్తత ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. అలా కాదంటే.. హిందూ దత్తత చట్టం, 1956 ప్రకారం దత్తత ప్రక్రియ జరగాలి. కానీ, సోను ఆ పని చేయలేదని ఫిర్యాదుల్లో తెలిపారు గీత. దాంతో విచారణ చేపట్టిన పోలీసులు శుక్రవారం సోనూ శ్రీనివాస్ గౌడను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.