తెలుగు ప్రజలు తన కుటుంబ సభ్యుల్లాంటి వాళ్లని అన్నారు నటుడు సోనూసూద్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పాలమాకుల గ్రామంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలను సందర్శించారు సోనూసూద్. అక్కడి విద్యార్థులతో కలిసి సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తాను పంజాబ్ వ్యక్తిని కానీ తెలుగు ప్రజలు తన కుటుంబ సభ్యులు అన్నారు. తన సోదరుడు సిద్దు రెడ్డి పేద ప్రజల కోసం ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం గర్వంగా ఉందన్నారు. సిద్దు రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు సమాజసేవలో ముందుకెళ్లాలని సూచించారు. పాలమాకుల మోడల్ స్కూల్ విద్యార్థులకు ల్యాప్ టాప్ లు పంపిణీ చేస్తామని తెలిపారు సోను సూద్...
అపుడు ఎన్ని కోట్లు ఉన్నా వృథా
నవంబర్ 28న నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లోని లలిత కళాతోరణంలో సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంకల్ప్దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు సోనూసూద్. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన..బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం కాదని, ప్రజల మనసులు గెలుచుకోవడం ముఖ్యం అని, అందుకోసం తన చివరి శ్వాస వరకు ప్రయత్నిస్తానని చెప్పారు. కరోనా సమయంలో తన ఆలోచనా విధానం మారిందని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోకపోతే ఎన్ని కోట్లు ఉన్నా వృథానే అని అనిపించిందని సినీ నటుడు సోనూసూద్ తెలిపారు.