న్యూఢిల్లీ: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు వ్యతిరేకంగా సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్‌ఐఏసీ ) కు వెళ్లిన జపనీస్ కంపెనీ సోనీకి చుక్కెదరయ్యింది. 10 బిలియన్ డాలర్ల విలువైన మెర్జింగ్ డీల్ నుంచి వెనక్కి తగ్గాక, అగ్రిమెంట్‌ను బ్రేక్ చేసిందనే కారణంతో జీ నుంచి 90 మిలియన్ డాలర్ల టెర్మినేషన్ ఫీజును సోని డిమాండ్ చేస్తోంది.
దీనికి సంబంధించి తాజాగా ఎమెర్జెన్సీ ఆర్బిట్రేషన్ పిటిషన్ వేయగా, తమ జూరిస్డిక్షన్లో లేదని కారణంతో ఎస్ఐఏసీ రిజెక్ట్ చేసిందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. మెర్జర్ అగ్రిమెంట్‌లో కుదుర్చుకున్న వివిధ ప్రీ– కండిషన్స్‌ను జీ ఫాలో కాలేదని సోనీ ఆరోపిస్తుండగా, ఈ ఆరోపణలకు జీ ఘాటుగా స్పందిస్తోంది. మరోవైపు ఇదే ఇష్యూకి సంబంధించి జీ షేర్ హోల్డర్లు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేశారు. ఈ ఇష్యూపై వచ్చే నెలలో హియరింగ్ ఉంది.