త్వరలోనే మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ మోడల్ ని తీసుకురానున్నట్లు తెలిపింది సోనీ సంస్థ. కొత్త స్మార్ట్ ఫోన్ ఎక్స్‌పీరియా ఎల్3ని మంగళవారం మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2019 ప్రదర్శనలో విడుదల చేసింది. ఇందులో 5.7 ఇంచుల డిస్ ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. పవర్ బటన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అమర్చారు. ఈ ఫోన్ లో 3300 MAH కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేయగా.. దానికి అడాప్టివ్ చార్జింగ్ ఫీచర్ ను అందిస్తున్నారు. ఈ ఫోన్ ధర వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది సోనీ.
సోనీ ఎక్స్‌పీరియా ఎల్3 ఫీచర్లు…
5.7 ఇంచ్ HD ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్, 3GB ర్యామ్, 32GB స్టోరేజ్, 512GB ఎక్స్ పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగా పిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4G VOLTE , బ్లూటూత్ 5.0,USB టైప్ సి, ఎన్ఎఫ్‌సీ, 3300 MAH బ్యాటరీ.
S
t
a
n
da
b
o
v
et
h
er
e
s
t#Xperia1 https://t.co/e0yK6mlrEz pic.twitter.com/WLBENGRpmo— Sony (@Sony) February 25, 2019