Sooraj Pancholi: సినిమా సెట్లో ప్రమాదం.. కాలిన గాయాలతో యంగ్ హీరో.. ఏం జరిగిందంటే?

Sooraj Pancholi: సినిమా సెట్లో ప్రమాదం.. కాలిన గాయాలతో యంగ్ హీరో.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ యంగ్ హీరో సూరజ్ పంచోలి (Sooraj Pancholi) నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కేసరి వీర్: లెజెండ్ ఆఫ్ సోమనాథ్”. ఈ సినిమా షూటింగ్లో  హీరో సూరజ్ పంచోలి గాయపడినట్లు సమాచారం.

కీలకమైన యాక్షన్ సీన్స్ తెరకెక్కించే సమయంలో సూరజ్ తీవ్రంగా గాయపడినట్లు న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాకుండా హీరో సూరజ్ ప్రస్తుతం హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని, చికిత్స తీసుకుంటున్నారని పలు కథనాలు వినిపిస్తోన్నాయి. అయితే, ఈ వార్తలను తాజా నివేదికలు కొట్టిపారేశాయి.

హీరో సూరజ్ పంచోలికి తీవ్రంగా గాయాలయ్యాయని వాస్తవమే. కానీ, ప్రమాదం జరిగింది రెండు నెలల కిందటని.. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నాడని తాజా నివేదికలు వెల్లడించాయి. ఇకపై ఈ వార్తలను స్ప్రెడ్ చేయడం తగదని సూచించాయి.

కేసరి వీర్: లెజెండ్ ఆఫ్ సోమనాథ్‌ను ప్రిన్స్ ధీమాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కను చౌహాన్ నిర్మించారు. ఈ పీరియాడికల్ డ్రామాలో సునీల్ శెట్టి, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సూరజ్ పంచోలి 2015లో హీరోగా కెరీర్ స్టార్ట్ చేశారు. శాటిలైట్ శంకర్ మరియు టైమ్ టు డ్యాన్స్ వంటి చిత్రాలలో నటించారు.

అసలేం జరిగిందంటే?

ముంబై ఫిల్మ్ సిటీలో 'కేసరి వీర్: లెజెండ్ ఆఫ్ సోమనాథ్' సినిమా సెట్లో ప్రమాదం జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాలోని కీలక స్టంట్ సీన్స్ షూట్ చేస్తున్న సమయంలో సూరజ్ పంచోలికి 'తీవ్ర కాలిన గాయాలు' అయ్యాయని  PTI ఒక నివేదిక పేర్కొంది.

సూరజ్ తండ్రి ఆదిత్య పంచోలి నిర్మాతతో మాట్లాడారని, "ఇందులో నిప్పు పెట్టే ప్యాచ్ వర్క్ చేస్తున్నప్పుడు.. ఇది కాస్త అదుపు తప్పి సూరజ్ పంచోలి కొంచెం గాయపడ్డాడు, చికిత్స కొనసాగుతోంది. అంతా బాగానే ఉంటుంది" తన తండ్రి చెప్పినట్లు ఆ నివేదిక పేర్కొంది. అయితే, ఇపుడు మళ్ళీ ఈ వార్తలు రిపీట్ అవుతుండటంతో.. వాటన్నిటినీ పూర్తిగా కొట్టిపారేస్తూ తాజా నివేదికలు క్లారిటీ ఇచ్చాయి.