రాంచీ: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకేజీల వెనుక ఆ పార్టీ హస్తం ఉందని, అక్కడి నుంచి వచ్చిన డబ్బునే జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్నారని ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలోనూ ఉద్యోగ అర్హత పరీక్షల పత్రాలన్నీ లీక్ అయ్యాయని ఆయన పేర్కొన్నారు.
‘‘జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ ఆడంబరం, ప్రదర్శన అంతా పేపర్ లీకేజీల సొమ్ము వల్లే. ఈ రోజుల్లో కోడి దొంగతనాల కేసులను కూడా దర్యాప్తు చేస్తున్న ఈడీ, సీబీఐ, ఎన్‌ఐఏ.. పేపర్ లీక్‌లపై మాత్రం విచారణ జరపడం లేదు. పేపర్లను లీక్ చేయడం.. ఆ డబ్బుతో ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనడం బీజేపీకి అలవాటైంది’’ అని ఎక్స్‌లో సోరెన్ ఆరోపించారు.