హైదరాబాద్లో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది. తార్నాకలోని డేవిడ్ కాలేజీలో చదువుతున్న శ్రీవైష్ణవి సోమవారం (నవంబర్ 25) కనిపించకుండా పోయింది. కాలేజీ టైమింగ్ లోనే బయటికి వెళ్లిన శ్రీ వైష్ణవి అప్పటినుంచి కనిపించడం లేదు. తండ్రికి ఫోన్ చేసి..‘‘ సారీ డాడ్ నేను వెళ్లిపోతున్నాను’’ అని చెప్పడంతో ఆ పేరెంట్స్ ఆందోళనతో బోరున విలపించాడు. కళాశాల యాజమాన్యం వేధింపులే తన బిడ్డ అదృశ్యానికి కారణమని అంటున్నారు.
శ్రీవైష్ణవి తార్నాకలోని డేవిడ్ మెమోరియల్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం సీఈసీ చదువుతోంది. సోమవారం మధ్యాహ్నం కాలేజీ టైమ్ మధ్యలోనే బయటికి వెళ్లిపోయింది. తండ్రికి ఫోన్ చేసిన తన బాధను చెప్పుకుంటూ..సారీ డాడ్ నేను వెళ్లిపోతున్నాను చెప్పింది.. ఆందోళనకు గురైన శ్రీవైష్ణవి పేరెంట్స్ కళాశాల వద్దకు వచ్చి యాజమాన్యాన్ని నిలదీశారు.. తన బిడ్డ అదృశ్యమవడానికి కారణం కాలేజీ యాజమాన్యమే అని ఆరోపిస్తున్నారు.