సారీ.. త్వరలోనే తిరిగొస్తా: షమీ

సారీ.. త్వరలోనే  తిరిగొస్తా: షమీ

ముంబై: ఆస్ట్రేలియా టూర్‌‌‌‌కు సెలెక్ట్ అవ్వకపోవడంపై టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అభిమానులు, బీసీసీఐకి సారీ చెప్పాడు.  రెడ్ బాల్ క్రికెట్‌‌ ఆడేందుకు తొందర్లోనే తిరిగొస్తానని ఆదివారం సోషల్‌‌ మీడియాలో పోస్ట్‌‌ చేశాడు. బెంగళూరులోని ఎన్‌‌సీఏ జిమ్‌‌లో వర్కౌట్స్‌‌ చేస్తున్న వీడియోను కూడా పంచుకున్నాడు. 

‘రోజు రోజుకు నా బౌలింగ్‌‌ ఫిట్‌‌నెస్‌‌ను పెంచుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నా. మ్యాచ్‌‌కు సిద్ధం అయ్యేందుకు, డొమెస్టిక్ రెడ్‌‌ బాల్ క్రికెట్ ఆడేందుకు కష్టపడుతున్నా. క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ, బీసీసీఐకి సారీ. అతి త్వరలోనే రెడ్ బాల్‌‌ క్రికెట్ ఆడేందుకు రెడీ అవుతా’ అని పేర్కొన్నాడు. గాయం కారణంగా గతేడాది వన్డే వరల్డ్ కప్ తర్వాత షమీ ఆటకు దూరమయ్యాడు. వచ్చే నెల ఆరంభంలో జరిగే రంజీ ట్రోఫీ నాలుగో రౌండ్‌‌లో షమీ తన బెంగాల్ స్టేట్ తరఫున బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.