మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నకిలీ డాక్టర్‌ అరెస్ట్

మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నకిలీ డాక్టర్‌ అరెస్ట్

మేడ్చల్ జిల్లా : నాగారం మున్సిపాలిటీ పరిధిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నడుపుతున్న ఓ నకిలీ డాక్టర్ ను పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. డీ ఫార్మసీ చేసిన బండ సాయి వర్ధన్ రెడ్డి అనే వ్యక్తి దమ్మాయిగూడకు వెళ్ళే దారిలో లతాశ్రీ మల్టీ స్పెషాలటీ పేరుతో ఓ హాస్పిటల్ నడుపుతున్నాడు. బండ సాయి వర్ధన్ రెడ్డి ఎంబీబీఎస్ డాక్టర్ అని చెలామణి అవుతున్నారు. 

తనకు వచ్చీరాని ట్రీట్ మెంట్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు. డీఎంహెచ్ఓ ఇతర జిల్లా వైద్య అధికారులతో కలిసి నకిలీ వైద్యుడు సాయి వర్ధన్ రెడ్డి ఆట కట్టించారు. ఫేక్ డాక్టర్ సాయి వర్దన్ రెడ్డిని అరెస్టు చేసి అతని కారు, రూ.8500 నగదు, స్టెతస్కోప్, రోగులకు సంబంధించిన ఫైల్స్ స్వాదీనం చేసుకున్నారు. ఎస్ఓటీ టీం సాయి వర్థన్ రెడ్డిని అదుపులోకి తీసుకొని నాగారం పోలీసులకు అప్పగించారు.