కుత్బుల్లాపూర్ లో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఓ ఘరానా ముఠా పట్టుబడింది. అక్రమ డబ్బు సంపాదన ధ్యేయంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఫేక్ కాల్ సెంటర్ నడుపుతూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న 13 మందిని పేట్ బషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియన్ సిటిజన్స్ డేటాను ఆన్ లైన్ లో కనుగొని... వారి నెంబర్లకు ఫోన్ చేసి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు నిందితులు.
అయితే పక్కా సమాచారంతో ఫేక్ కాల్ సెంటర్ పై మేడ్చల్ ఎస్ఓటీ, పేట్ బషీరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో మోసగాళ్ల దగ్గర నుండి 13 డెస్క్టాప్ మానిటర్స్, 14 సీపీయూలు, 13 హెడ్ ఫోన్లు, ఒక హార్డ్ డిస్క్, ఒక పెన్ డ్రైవ్ ,8 సిమ్ కార్డులు ,18 మొబైల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు. ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్న 13 నిందితులను పేట్ బషీరాబాద్ పోలీసులుకు అప్పగించారు. కేసుల నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు మేడ్చల్ జోన్ డిసిపి సందీప్ రావు. అమెజాన్ ప్రైమ్, సబ్ స్క్రిప్షన్స్, ఇంటర్నెట్ స్పీడ్ సమస్య అంటూ పంపించే మెసేజ్ లు ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని, వారి వద్ద నుండి 13 డెస్క్టాప్ మానిటర్స్, 14 సీపీయూలు, 13 హెడ్ ఫోన్లు, ఒక హార్డ్ డిస్క్, ఒక పెన్ డ్రైవ్ ,8సిమ్ కార్డులు ,18 మొబైల్ ఫోన్లు స్వాధీనపరుచుకునామన్నారు. ప్రధాన నిర్వాహకుడు ప్రమోద్ రెడ్డి,తో పాటు మొత్తం 13మందిని అదుపులోకి తీసుకున్నామని మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లుగా తెలిపారు.