కల్తీ పాల కేంద్రాలపై ఎస్‌వోటీ పోలీసుల దాడి..

భూదాన్ పోచంపల్లి, వెలుగు:  కల్తీ పాలు తయారు చేస్తున్న కేంద్రాలపై ఆదివారం  యాదాద్రి జిల్లా భువనగిరి ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. కల్తీ పాలు తయారు చేస్తున్న ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముకుల గ్రామానికి చెందిన వలిగొండ పాండు, గౌస్ కొండ గ్రామానికి చెందిన అస్గర్ కల్తీ పాలు తయారు చేసి అమ్ముతున్నారు. సమాచారం అందుకున్న ఎస్​వోటీ పోలీసులు ఆదివారం ఉదయం  దాడులు నిర్వహించారు. వారి దగ్గర  350 లీటర్ల కల్తీ పాలు, 2 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 11 డోలోఫర్ స్కిమ్డ్ మిల్క్ ప్యాకెట్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిని  భూదాన్ పోచంపల్లి పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్పి,  పాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు.