అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు.. నిందితులు అరెస్ట్

సంగారెడ్డి జిల్లాలో లారీల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డుపై 60 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ రేషన్ బియ్యాన్ని హైదరాబాద్ నుంచి బీదర్ కు తరలిస్తుండగా నిందితులు పట్టుబడ్డారు. లారీ డ్రైవర్లు బీమాబాయి, రాళ్ల ముంజ రాజాబాయ్ ను అదుపులోకి తీసుకున్న  రామచంద్రాపురం పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.