రంగారెడ్డి జిల్లా : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై SOT పోలీసులు దాడులు నిర్వహిచారు. తిరుమల లడ్డు తయారీకి వాడే నెయ్యి కల్తీ జరిగిందని వివాదం నడుస్తోన్న సమయంలో ఈ కల్తీ నెయ్యి తయారీ కలకలం రేపింది. ఏకంగా 15వేల కేజీల కల్తీ నెయ్యి అధికారులకు చిక్కింది. మైలర్ దేవ్ పల్లి కాటేదాన్ పారిశ్రామిక వాడలోని కల్తీ నెయ్యి కేంద్రంపై గురువారం రాజేంద్రనగర్ SOT పోలీసులు రైడ్స్ చేశారు.
అపరిశుభ్ర వాతావరణంలో, నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న మైలర్ దేవ్ పల్లి పోలీసులు పరికరాలను పరిశీలిస్తున్నారు. 15 వేల కేజీల కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన మెటీరియల్ ను ఎస్ఓటీ పోలీసులు మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు.