హుక్కా సెంటర్పై పోలీసుల దాడి..10 మంది అరెస్ట్

శంషాబాద్ ఉప్పర్ పల్లి వద్ద ఉన్న హైటెక్ హుక్కా సెంటర్ పై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. హుక్కా తాగుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. బ్లాక్ కాఫీ ముసుగులో హుక్కా సెంటర్ నడిపిస్తున్న విషయం తెలుసుకున్న ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి హుక్కా సెంటర్ గుట్టు రట్టు చేశారు. దాడిలో పట్టుబడ్డ వారిని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. హుక్కా సెంటర్ నిర్వాహకుడితో పాటు 10 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.