- 450 లీటర్ల కల్తీపాలు 300 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ స్వాధీనం
భూదాన్ పోచంపల్లి, వెలుగు : కల్తీ పాలు తయారు చేస్తున్న కేంద్రాలపై భువనగిరి ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. బుధవారం ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లి, కనుముక్కల గ్రామాల్లో కల్తీ పాలు తయారు చేస్తున్న కప్పల రవి, కుంభం రఘులను అదుపులోకి తీసుకున్నారు.
భీమనపల్లికి చెందిన కప్పల రవి నుంచి 350 లీటర్ల కల్తీ పాలు,100 ఎంల్ హైడ్రోజన్ పెరాక్సైడ్, రెండు డోలోఫర్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ప్యాకెట్లు, కనుముక్కుల గ్రామానికి చెందిన కుంభం రఘు దగ్గర 100 లీటర్ల కల్తీ పాలు, 200 ఎంఎల్ హైడ్రోజన్ పెరాక్సైడ్, రెండు డోలోఫర్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. కల్తీ పాలను టెస్టుల కోసం ల్యాబ్ కు పంపిస్తున్నట్టు ఎస్వోటీ పోలీసులు తెలిపారు.