జవహర్​నగర్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు ..వెయ్యి కిలోలు పట్టివేత

జవహర్​నగర్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు ..వెయ్యి కిలోలు పట్టివేత
  •  నిందితుడి అరెస్ట్

జవహర్​నగర్, వెలుగు: హైదరాబాద్​ జవహర్​నగర్ ​పరిధిలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్​ తయారు చేస్తున్న ఓ ఇంటిపై మల్కాజిగిరి ఎస్ఓటీ, స్థానిక పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో సుమారు వెయ్యి కిలోల కల్తీ పేస్ట్ ను​స్వాధీనం చేసుకున్నారు. అలాగే, నిందితుడు మహ్మద్ అతావుల్లా(25)ను అరెస్ట్ చేసి పోలీస్​స్టేషన్​కు తరలించారు. 

వివిధ ఆహార పదార్థాలతో పేస్టును తయారు చేసి, అందులో రసాయనాలు కలిపి మార్కెట్​లో విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్​కు పంపినట్టు జవహర్ నగర్ సీఐ సైదయ్య తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.