హైదరాబాద్ లో పలు చోట్ల ఎస్ఓటీ దాడులు.. గంజాయి పట్టివేత

 హైదరాబాద్ నగరంలో పలు చోట్ల  గంజాయిని పట్టుకున్నారు సైబరాబాద్ SOT పోలీసులు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీవీనగర్, సిద్ధిక్ నగర్ లో 4 కేజీకి పైగా గంజాయిని పట్టుకున్నారు. ఒరిస్సాకు చెందిన గగన్ కుమార్ బెహరా, కుషాల్ ప్రధాన్ ,మితునా థాయ్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర లా చదువుతున్న ఓ విద్యార్థి దగ్గర 5 LSD మత్తు మందు స్వాధీనం చేసుకున్నారు. 

ALSO READ :- డీఎస్పీ ప్రణీత్ రావుపై దర్యాప్తు ముమ్మరం

రాజేంద్రనగర్ అత్తాపూర్  డీ మార్ట్ సర్వీస్ రోడ్ లో ఆటోలో గంజాయి పెట్టుకుని అమ్ముతున్న యువకుడిని పట్టకున్నారు అత్తాపూర్ పోలీసులు. నిందితుడి దగ్గన నుండి 210 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.