
భారత మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ కుమార్తె సనా కూతురు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కోల్‌కతా, డైమండ్ హార్బర్ రోడ్డులోని బెహలా చౌరస్తా ప్రాంతంలో సనా కారును వెనుక నుంచి బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమెకు స్పల్ప గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ సీటు పక్కనే కూర్చున్న సనా స్పల్ప గాయంతో బయటపడిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే బస్సు ఢీకొనడంతో ఆమె కారు స్వల్పంగా దెబ్బతింది. ఢీకొట్టిన అనంతరం బస్సు డ్రైవర్.. ఆపకుండా వేగంగా పోనిచ్చాడు. దాంతో, స్థానికులు వెంబడించి బస్సును సఖేర్ బజార్ సమీపంలో ఆపగలిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.