ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఓ వైపు కెప్టెన్సీలో, మరోవైపు ప్లేయర్ గా విఫలమవుతూ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. దీనికి తోడు వ్యక్తిగతంగా ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఆటిట్యూడ్ ఎవరికీ నచ్చడం లేదు. ఎన్నో అంచానాలు మధ్య ముంబై జట్టులోకి రాయల్ గా అడుగుపెట్టిన పాండ్యకు అప్పుడే కష్టకాలం ఎదురైంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ లు ఓడిపోయింది. మరోవైపు పాండ్య ఎక్కడికి వెళ్లినా గ్రౌండ్ లోనే అతన్ని తిడుతున్నారు. దీంతో పాండ్యకు మద్దతు లభిస్తుంది. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. పాండ్యను వెనకేసుకొచ్చాడు.
ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందు రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించి హార్దిక్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఈ విషయం చాలా మంది ముంబై అభిమానులకు రుచించలేదు. దీంతో మైదానంలోనే కాకుండా హార్దిక్ బయట ఎక్కడ కనిపించినా సరే సొంత జట్టు అభిమానులే ట్రోలింగ్ చేయడం షాకింగ్ గా మారింది. ఈ విషయం గురించి గంగూలీ మాట్లాడుతూ..‘అభిమానులు హార్దిక్ పాండ్యాను ట్రోల్ చేయకూడదు. ఇది కరెక్ట్ కాదు. రోహిత్ శర్మ నెక్ట్ లెవెల్. అతడి ప్రదర్శన వేరే స్థాయిలో ఉంది. అయితే.. ప్రాంఛైజీ కెప్టెన్‌గా నియమించడం హార్దిక్ తప్పు కాదు.’ అని గంగూలీ అన్నాడు. ఇటీవలే అశ్విన్ సైతం పాండ్యకు మద్దతు తెలిపాడు.
ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఇంకా బోణీ కొట్టలేదు. ఆడిన 3 మ్యాచ్ ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. గుజరాత్ తో గెలిచే మ్యాచ్ లో ఓడిన హార్థిక్ సేన..ఆ తర్వాత వరుసగా సన్ రైజర్స్, రాజస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ జట్టులో చేరడంతో ముంబై గెలుపుపై ధీమాగా కనిపిస్తుంది. మరి రేపు సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ తో జరగబోయే మ్యాచ్ లో గెలిచి పాయింట్ల ఖాతా ఓపెన్ చేస్తుందో లేదో చూడాలి.
Sourav Ganguly: "It's not Hardik's fault that he has been appointed as Captain"pic.twitter.com/g1t7EBPBUG
— CricTracker (@Cricketracker) April 6, 2024