భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రిషబ్ పంత్ త్వరలోనే మీ ముందుకు రానున్నారు. కారు ప్రమాదం కారణంగా దాదాపు ఏడాది పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న పంత్ ఐపీఎల్ 2024 లో కనిపించనున్నారు. పూర్తిస్థాయిలో కోలుకొని కెప్టెన్ గానే బరిలోకి దిగబోతున్నాడు. అయితే పంత్ ఎప్పుడు ఢిల్లీ క్యాంప్ లో చేరతాడో భారత మాజీ కెప్టెన్ గంగూలీ తెలిపారు.
పంత్ ఫిట్‌గా ఉండటానికి తీకే కసరత్తులు చేశాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) నుండి క్లియరెన్స్ పొందిన వెంటనే పంత్ మార్చి 5న DC క్యాంపులో చేరాలని భావిస్తున్నట్లు సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. పంత్ పూర్తి ఫిట్ నెస్ సాధిస్తే కెప్టెన్సీ బ్యాకప్ గురించి మాట్లాడుకుందామని.. చాలా కెరీర్ ఉన్నందున అతనితో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని ఈ భారత మాజీ కెప్టెన్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో అన్నారు.
పంత్ గైర్హాజరీతో గత సీజన్‌లో డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అతని కెప్టెన్సీలో ఢిల్లీ దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్‌ల్లో కేవలం ఐదింట విజయం సాధించింది. దీంతో లీగ్ దశలోనే నిష్క్రమించడమే కాకుండా పాయింట్ల పట్టికలో కింద నుండి రెండో స్థానంలో నిలిచింది. ఒకవేళ పంత్ తిరిగి జట్టులో చేరినా పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టకపోతే మరోసారి వార్నర్ సారథిగా కొనసాగే అవకాశముంది.
ఇప్పటివరకూ ఐపీఎల్‌లో 98 మ్యాచ్‌లు ఆడిన పంత్ 2838 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే, అతని ఖాతాలో 64 క్యాచ్‌లు, ఆరు రనౌట్లు, 18 స్టంపింగ్‌లు ఉన్నాయి.
Sourav Ganguly announces NCA's decision to clear Rishabh Pant on March 5, paving the way for his return to action. 🤩✨🏏
— Icecric.news (@icecricnews) March 2, 2024
📸: Getty Images#rishabhpant #hardikpandya #Davidmiller #Cricket #CricketUpdates #icecricnews #INDvENG #RanjiTrophy #RohitSharma #indiancricketteam pic.twitter.com/xCA7AT48Sk